ఆ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ఆమ్రపాలి

తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ ఆమ్రపాలి పేరు తెలియని వారుండరు. ఆమె ఏం చేసినా అది బిగ్ న్యూసే. కలెక్టర్ గా ప్రజలకు సేవలందించడంలో ముందే..  రియాలిటి లైఫ్ ని ఆస్వాదించడంలోనూ ఆమె ముందే. ట్రెక్కింగ్ చేసినా, గుట్టలలో యాత్రలు చేసినా, మోడరన్ డ్రెస్సులు ధరించినా ఆమెకు ఆమెనే సాటి.

వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఉన్న ఆమ్రపాలి హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. హన్మకొండలోని వడ్డపల్లి చెరువు వద్ద ఆమ్రపాలి మొక్కలు నాటారు. వరంగల్ మేయర్ నరేందర్ తో పాటు, టిఎన్జీవో ఉద్యోగులకు, విద్యార్థులకు ఆమె గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కలెక్టర్ ఆమ్రపాలి  పిలుపునిచ్చారు. ఎంపీ కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ పిలుపు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ గా మారింది. నేతలు, అధికారులు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు.