గోషామహాల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ సీఈవో ఆమ్రపాళిని కలిశారు. గోషామహాల్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. ఓటర్ జాబితాలో ఓట్లు లేనివారు ఇటివల నమోదు చేసుకున్నారని కానీ వారికి ఓటరు కార్డులు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాజాసింగ్ ఆమ్రపాలి దృష్టికి తీసుకెళ్లారు.
పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు వీలుగా లొకేషన్ యాప్స్ ఏర్పాటు చేయాలన్నారు. మీ సేవ కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డుల జారికి 50, 100 రూపాయిలు వసూలు చేస్తున్నారని దీనిని వెంటనే పరిష్కరించాలని రాజాసింగ్ ఆమ్రపాలిని కోరారు. వీటన్నింటి పట్ల ఆమ్రపాలి స్పందించారని తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారని రాజాసింగ్ తెలిపారు.
పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ఓటర్లను ప్రభావితం చేేసే అవకాశాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని కోరారు. కొన్ని వర్గాల వారిని బెదిరించి ఓట్లు వేయించుకునే అవకాశం ఉందన్నారు. వీటన్నింటి పై విచారణ చేయాలని రాజాసింగ్ ఆమ్రపాలికి విజ్ఞప్తి చేశారు.