లక్షల ఖర్చుతో జగన్.! వంద రూపాయల ఖర్చుతో పవన్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కౌంటర్ ఎటాక్ రానే వచ్చింది.! పవన్ కళ్యాణ్ స్పందించకపోవడమేంటి.? తెలుగుదేశం పార్టీ నుంచి అనుమతి రాలేదా.? లేదంటే, కాల్షీట్లు రాలేదా.? అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నించేశాయి నిన్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘రౌడీ సేన’ విమర్శలకు సంబంధించి.

సింపుల్‌గా ఓ కార్టూన్ వదిలి చేతులు దులుపుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సాపురం పర్యటన సందర్భంగా లక్షలు ఖర్చయ్యాయి. కాదు కాదు, కోట్లు ఖర్చయ్యాయంటారు కొందరు. సరే, లక్షలైతే ఖర్చయ్యి వుండాలి కదా.!

వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు నర్సాపురం బహిరంగ సభ ద్వారా. అవన్నీ పక్కకు పోయాయ్.. ‘రౌడీ సేన’ అన్న విమర్శ చుట్టూనే మీడియాలో రచ్చ జరిగింది. అంటే, ‘రౌడీ సేన’ అనడం కోసమే వైఎస్ జగన్ లక్షలు ఖర్చు చేసి నర్సాపురం బహిరంగ సభకు వెళ్ళారా.? అన్న చర్చకు ఆస్కారమేర్పడుతుంది కదా.?

కానీ, జస్ట్ వందల రూపాయల విలువ అయినా చేస్తుందో లేదో తెలియని ఓ కార్టూన్‌తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఎటాక్ ఇచ్చేశారు జనసేనాని. వైసీపీ నేతల్ని దొంగల్లా ఆ కార్టూన్‌లో చిత్రీకరించారు. పలువురు మంత్రుల చిత్రపటాలూ అందులో కనిపించాయి. ఆ దొంగల ముఠాకి నాయకుడిగా వైఎస్ జగన్ చిత్రపటాన్నీ ప్రస్తావించారు.

‘ముఖ్యమంత్రి స్థాయిలో వుండి ప్రత్యర్థి పార్టీని రౌడీ సేన అని దూషించిన జగన్’ అంటూ ఆ కార్టూన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో, జనసేన పార్టీ పేదలకు ఇస్తోన్న భరోసా గురించీ పేర్కొంటూ, ‘ఇదొక రౌడీ సేన నమ్మకండి’ అని జగన్ చెబుతున్నట్లుగా వివరించారు.

ఒక్క కార్టూన్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేసిందన్నది నిర్వివాదాంశం. వున్నపళంగా వైఎస్ జగన్, తన సలహాదారుల్ని మార్చుకోకపోతే, ప్రభుత్వానికీ అలాగే పార్టీకీ చాలా చాలా డ్యామేజ్ జరిగిపోతుంది.