CM YS Jagan: పింఛనుదారులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

CM YS Jagan: జగనన్న సర్కార్ అవ్వ తాతలకి కొత్త శుభవార్తని అందించింది. వచ్చే ఏడాది లో జనవరి 1 నుండి వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్నిరూ. 2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటివరకు జగన్ సర్కారు పెన్షన్ దారులకు రూ. 2500 అందిస్తుంది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా తొలి ఏడాది రూ.2000గా ఉన్న పింఛన్ ను రూ.2250కు పెంచారు.

అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలు కూడా రూ.250 చొప్పున పెంచాల్సి ఉంది..కాని పెంచలేదు జగనన్న సర్కారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెన్షన్లను రూ. 3,000 లకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61,72,964 మంది పెన్షన్ దారులు ఉన్నారు.

అంతేకాకుండా నూతన సంవత్సరం జనవరిలో ఏపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నది. జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చెయ్యనట్లు తెలిపింది. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45 – 60ఏళ్ళు) మూడు ఏళ్ళల్లో రూ. 45వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా.. జనవరిలో రైతు భరోసా అమలు చేయనున్నట్లు కూడా తెలిపింది.