జగన్ కొత్త స్ట్రాటజీ… బాబుకు కష్టమే?

మీడియాలో వీడియోలు, ప్రెస్ మీట్లలో ప్రకటనలు కంటే… నేరుగా ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం ఏమిచేసింది, ఎంత చేసింది. కరోనా కష్టకాలంలో కూడా ఎంత కమిట్ మెంట్ గా పనిచేసింది వంటి విషయాలను చెప్పాలని ఇప్పటికే జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే… అదొక్కటే సరిపోదు.. అంతకు మించి కావాలని కొత్త స్కెచ్ వేశారు జగన్.!

అవును… ఇప్పటి వరకు తాము చేసింది చెప్పుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, ప్రతిఒక్క లబ్ధిదారు కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పదే పదే చెప్పే జగన్… ఇదే విషయాన్ని గడప గడపకు ఎమ్మెల్యేలను పంపి చెప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలను, మంత్రులను ముందుండి నడిపిస్తున్నారు.. అప్పుడప్పుడూ రివ్యూ మీటింగ్స్ పెట్టి.. నిఘా ఉందని చెప్పకనే చెబుతున్నారు.

అయితే… ఒకపక్క చేసినవాటి గురించి మాత్రమే చెప్పుకుంటూ పోతుంటే… మరోపక్క ప్రతిపక్షాలు విమర్శలు చేసే విషయంలో దూకుడు పెంచేస్తున్నాయి. దీంతో పనికిరాని విషయాలను తెరపైకి తెస్తున్నాయాని భావిస్తున్న జగన్… గడప గడపకూ కార్యక్రమంలోనూ – మా భవిష్యత్తు నువ్వే జగనన్న లోనూ.. గత ప్రభుత్వం ఏమి చెయ్యలేదో కూడా చెప్పాలని నిర్ణయించారు.

అవును… సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన టీడీపీ… వెనకా ముందూ చూడకుండా విమర్శలు చేస్తుంది. జగన్ చేస్తున్న సంక్షేమంపై సెటైర్స్ వేస్తుంది. దీంతో… ఇకపై, తమ ప్రభుత్వం చేస్తున్నదే కాకుండా.. గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎలా ఇబ్బందులు పెట్టిందో, చేసే అవకాశం ఉండి కూడా చేయకుండా ఎలా తప్పించుకుందో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.

అంటే… ఇకపై ఇంటింటికీ వెళ్లిన వైసీపీ నాయకులు.. జగన్ ఏమి చేశారో చెబుతూ.. గతంలో బాబు ఎన్ని ఘోరాలు చేశారో కూడా చెప్పబోతున్నారన్నమాట! దీనివల్ల… ఇప్పుడు అంతెత్తున కబుర్లు చెబుతున్న ప్రధాన ప్రతిపక్షం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవడంతోపాటూ.. గతంలో బలంగా హామీలిచ్చి నెరవేర్చని విషయాలు కూడా జనాల్లో చర్చల్లోకి రానున్నాయి. మరి జగన్ వేసిన ఈ కొత్త స్కెచ్ ని బాబు & కో లు ఎలా ఎదుర్కుంటారనేది వేచి చూడాలి!