మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు జగన్ పొలిటికల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసు వైసీపీకి ప్లస్ కాగా 2024 ఎన్నికల్లో వివేకా హత్య కేసు వైసీపీకి మైనస్ కానుంది. జగన్ తలచుకుంటే వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడటం కొన్ని నిమిషాల్లో జరుగుతుంది. అయితే జగన్ సర్కార్ విచారణకు అడ్డు పడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు తాజాగా వెల్లడించిన తీర్పు వల్ల జగన్ సర్కార్ పరువు పోయింది. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడం వల్లే విచారణ ఆలస్యమవుతోందని సీబీఐ చెబుతుండగా ఈ కేసులో చోటు చేసుకుంటున్న మలుపులు అన్నీఇన్నీ కావు. సాక్షులు సైతం ఈ కేసు విషయంలో మాట్లాడుతూ తమకు బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ అవుతోంది.
ఈ కేసులో నిందితులకు శిక్ష పడని పక్షంలో జగన్ సర్కార్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. జగన్ చెల్లెలు సునీత న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇస్తున్నారు. ప్రజలకు న్యాయం చేస్తున్న జగన్ సొంత కుటుంబానికి న్యాయం చేసుకోలేకపోతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఒక ఎంపీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ ఎంపీ మాత్రం ఈ కేసు గురించి నోరు మెదపడానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ సర్కార్ చేస్తున్న చిన్నచిన్న తప్పులు రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించే ఛాన్స్ అయితే ఉంది. జగన్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో సామాన్య ప్రజల నుంచి కూడా నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.