AP: జగన్ నాటకాలను నమ్మొద్దు…. అప్రమత్తంగా ఉండండి…..హెచ్చరించిన చంద్రబాబు?

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మంత్రులతో సమావేశం అయ్యారు అయితే ఎనిమిది నెలల పాలనపై సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలోనే తిరుపతి లడ్డు గురించి కూడా ఈయన ప్రస్తావనకు తీసుకువచ్చారు గతంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగింది అంటే ఎవరూ కూడా నమ్మలేదని అయితే ఇప్పుడు సిబిఐ అరెస్టులతో నిజాం బయటపడింద చంద్రబాబు నాయుడు తెలిపారు.

లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అరెస్టుల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. ఈ అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను చెప్పింది నిజం అని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తితో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారని అంటే.. జగన్‌ గతంలో తప్పుబట్టారని, ఇప్పుడు అదే నిజమైందని చంద్రబాబు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వాడే నెయ్యికి సంబంధించి వైసీపీ హయాంలోనే టెండర్లకు పిలిచారని.. అంతే కాకుండా కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా మార్చారని అన్నారు చంద్రబాబు. లడ్డు తయారీ కోసం కల్తీ నెయ్యి వాడుతున్నారని బయటకు రావడంతో నెయ్యి సరఫరాలో ఏ విధమైనటువంటి అక్రమాలు జరగలేదని జగన్ వాదించారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరిని నమ్మించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారని చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పైర్ అయ్యారు.