పవన్ కళ్యాణ్‌పై పోటీకి వైసీపీ నుంచి సినీ ప్రముఖుడు.?

2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. చివరి నిమిషం వరకూ సాగదీసి 2019 ఎన్నికల్లో జనసేనాని రెండు నియోజకవర్గాల్లోనూ రాజకీయంగా చావు దెబ్బ తినేసిన సంగతి తెలిసిందే.

ఒకే ఒక్క నియోజకవర్గంలో గనుక జనసేనాని పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళి వుండేవారే. గతంలో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు చోట్ల పోటీ చేశారు గనుక, తానూ అదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలనుకుని పవన్ కళ్యాణ్ బొక్క బోర్లా పడ్డారు.

అయితే, ఈసారి అలాంటి తప్పు చేయకూడదని జనసేనాని అనుకుంటున్నారు. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారుట. ఆ ఒక్కటీ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. గాజువాక, భీమవరంతోపాటుగా పిఠాపురం, తిరుపతి నియోజకవర్గాలు పరిశీలనలో వున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా వుంటే, జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఆయన మీద పోటీకి ఓ సినీ ప్రముఖుడ్ని దింపాలని వైసీపీ అనుకుంటోందట. ఆ సినీ ప్రముఖుడెవరు.? ముందైతే, మహిళా నేతని రంగంలోకి దించాలని వైసీపీ భావించిందట.

కానీ, టాలీవుడ్ నుంచి ఓ సినీ ప్రముఖుడు తాను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తానంటూ ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద తన మనసులో మాటని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ సినీ ప్రముఖుడెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.