కొత్త చర్చ… పవన్ కల్యాణ్ కు చిరంజీవి పోస్ట్!!

ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు సరే, సీట్ల సర్దుబాటు సంగతేమో కానీ… సీఎం పోస్ట్ విషయంలో మాత్రం పెద్ద రచ్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చెరో రెండున్నరేళ్లూ సీఎం కుర్చీలో కుర్చోవాలని కాపు సామాజికవర్గం నుంచి బలమైన వాదన వినిపిస్తుంది. అలాకానిపక్షంలో కాపుల ఓట్లు టీడీపీకి పూర్తిగా పోలయ్యే అవకాశాలపై ఆశలు వదులుకోవాలని అంటున్నారు.

దీంతో… ఈ సమస్యకు ఆదిలోనే పరిష్కారం కనుగొనాలని బాబు భావిస్తున్నారని.. అందుకోసం బీజేపీ పెద్దలతో కలిసి ఒక పరిష్కారం ఆలోచించారని ఒక గాసిప్ పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఫలితంగా ముందు ముందు జనసేన నుంచి తనకు ఇబ్బంది లేకుండా బాబు ప్లాన్ చేశారని.. ఆ మేరకు బీజేపీ నుంచి హామీ తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ పొలిటికల్ కెరీర్ గురించి చంద్రబాబు – బీజేపీ పెద్దలు ఒక క్లార్టీకి వచ్చారనేది ఆ గాసిప్ సారాంశం.

దానిప్రకారం… వచ్చే ఎన్నికల్లో జనసేన – బీజేపీలను కలిపి కొన్ని సీట్లు కేటాయించడంతో పాటు పవన్ కల్యాణ్ ను ఎంపీగా పోటీ చేయించాలని అంట. ఈ క్రమంలో పవన్ ను ఎంపీగా పోటీ చేయించి.. గెలిపించుకుని.. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని ప్లాన్ చేశారని అంటున్నారు. ఫలితంగా… కేంద్రమంత్రి హోదాలో గతంలో తన అన్న చిరంజీవి పనిచేసినట్లుగా… పవన్ కూడా వర్క్ చేస్తారని భావిస్తున్నారంట.

వాస్తవానికి ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం టీడీపీ కూటమికి పడాలి అంటే ఆ సామాజిక వర్గం అధికారంలో వాటా కోరుకుంటోందనేది తెలిసిన విషయమే. దీంతో… దాంతో ఆ వర్గాన్ని శాంతింపచేయడానికి అన్నట్లుగా ఈ కొత్త ఫార్ములా ఒకటి బయటకు తెచ్చారని అంటున్నారు. అంటే… టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో ముఖ్యమంత్రిగా అధికారంలో చంద్రబాబు ఉంటే… కేంద్రంలోని అధికార కూటమిలో మంత్రిగా పవన్ ఉంటారన్నమాట.

ఈ విషయంలో పవన్ అంగీకరిస్తే… కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయించాలని అంటున్నారని తెలుస్తుంది. ఆ ఆలోచనల సంగతి అలా ఉంటే… వాస్తవానికి పవన్ ను కేంద్రమంత్రిగానో, రాజ్యసభ సభ్యుడిగానో చూడాలని కాపు సమాజికవర్గం భావించడం లేదు!! నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి లేని పదవులు తమకు వద్దని… పవన్ ను కనీసం రెండున్నరేళ్లయినా సీఎంగా చూడాలని వారు కోరుకుంటున్నారని తెలుస్తుంది.

ఇవన్నీ చంద్రబాబుకి తెలియనివి కావు! అయితే… ఇలా నానించి నానించి చివరిలో బీజేపీతో సెట్ అయిన తర్వాత పవన్ ని అలా తప్పించాలని బాబు & కో భావిస్తున్నారంటు వస్తున్న ఈ ఊహాగాణాలు వాస్తవాలైతే… చంద్రబాబును కాపులు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని.. అది 23 కంటే తక్కువ నెంబర్ ను కూడా ఇవ్వగలదని అంటున్నారట జనసైనికులు. అందువల్ల… వినిపిస్తున్న ఈ గాసిప్ ని గాసిప్ గా ఉండనివ్వాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది.