వివాదంలో ఇరుక్కున్న టిడిపి ఎమ్మెల్యే చింతమనేని (వీడియోలు)

విజయవాడలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అంటూ వ్యక్తులు కారులో హల్ చల్ చేశారు. ఏపీ 16 సీఎం 22 44 వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బందరు లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్రాస్ చేశారు. ట్రాఫిక్ జామ్ అయ్యేలా రోడ్డుపైన వారి వాహనం నిలిపారు. వేరే వాహనాలకు అడ్డుగా ఉందని, పక్కకు నిలిపి మాట్లాడుకోమని ట్రాఫిక్ కానిస్టేబుల్ వారికి సూచించాడు.

కారు నుండి బయటకు దిగిన ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ సతీష్ కుమార్ పై వాగ్వాదానికి దిగారు. ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ నువ్వు, మాకు చెప్తావా అంటూ కానిస్టేబుల్ పై దుర్భాషలాడారు. ఆగ్రహించిన కానిస్టేబుల్ పద్దతిగా మాట్లాడాలంటూ వారిని హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తులు సతీష్ కుమార్ తో దురుసుగా ప్రవర్తించారు.

కానిస్టేబుల్ కారును స్టేషన్ కి తీసుకువెళ్లాలి అని చెప్పడంతో ఆయనపై దాడికి దిగారు. తన కాలర్ పట్టుకుని కొట్టినట్టుగా కానిస్టేబుల్ ఆరోపించాడు. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై కానిస్టేబుల్ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

chinthamaneni followers beats traffic constable

ఇదిలా ఉండగా కారులో ఉన్న గణేష్ అనే వ్యక్తి మాత్రం కానిస్టేబుల్ సతీష్ కుమార్ తమపై చిన్న విషయానికి చేయి చేసుకున్నట్టు ఆరోపిస్తున్నాడు. కారు ఆపి అడ్రెస్ అడుగుతుండగా కానిస్టేబుల్ కారు పక్కకు పెట్టమన్నాడని చెప్పాడు. ఒక నిమిషం సర్ తీస్తాము అని చెప్పిన వినకుండా బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడని తెలిపాడు. మేము కూడా కేసు పెడతాము అని వెల్లడించాడు. ఆ వీడియో కింద ఉంది చూడండి.

chinthamaneni followers allegations against constable

ఈ వ్యవహారంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. చింతమనేని అనుచరులు అంటూ కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తులకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. చింతమనేని అనుచరులం అని చెబుతూ ఆగడాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.