టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరా.. చంద్రబాబు ప్లాన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో కచ్చితంగా చెప్పలేం. జనసేనతో పొత్తు ఉంటే అధికారం టీడీపీదే అని ఇందులో సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఇతర పథకాలతో పోల్చి చూస్తే అన్న క్యాంటీన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను చంద్రబాబు తొలగించే ఛాన్స్ కూడా ఉంది.

వాలంటీర్లలో ఎక్కువమంది వైసీపీకి అనుకూలం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది వైసీపీకి అనుకూలం కాకపోయినా వైసీపీ వల్లే తమకు ఉద్యోగం వచ్చిందనే కారణం వల్ల వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లను తొలగించి తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లకు ప్రాధాన్యత ఇవ్వనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు రాష్ట్రంలో కొనసాగుతాయి కాబట్టి టీడీపీ తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లను నియమించే దిశగా చంద్రబాబు అడుగులు వేయనున్నారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఒకే సమయంలో 2.6 లక్షల మంది వాలంటీర్లను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కూడా కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

అయితే చంద్రబాబు ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలను మించి అమలు చేయాలని భావిస్తున్నారు. జగన్ సర్కార్ కు మరో ఛాన్స్ రానంత అద్భుతంగా పాలించాలని చంద్రబాబు భావిస్తున్నారు.