AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైకాపా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులకు అండగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను దిగారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వైకాపా నేతలు కార్యకర్తలు రైతులతో సహా ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ను ముట్టడిస్తున్న విషయం మనకు తెలిసిందే.
విజయవాడలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి, బెల్లం దుర్గ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు వీరందరిని అడ్డుకోవడమే కాకుండా వీరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇలా వైకాపా నేతలను అరెస్టు చేయడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజల ఓట్లు వేయించుకోవడం కోసం ఎన్నికలకు ముందు ప్రజలందరిని సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు హామీలను ఇచ్చి అందరిని మోసం చేశారని మండిపడ్డారు.
క్రికెట్ సిక్స్ ఇచ్చిన కుటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజులు సరైన రీతిలో బుద్ధి చెప్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇవ్వడం లేదని ఇలా సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇచ్చిన హామీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతినెల ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.