వారెవ్వా ..చంద్రబాబు నువ్వు సూపర్ అయ్యా .. పంచాయతీ పోరులో కీలక ట్విస్ట్ !

Chandrababu Naidu should take care about this issue 

ఏపీలో పంచాయతీ పోరు మరింత రసవత్తకరంగా మారింది. పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది అన్ని పార్టీల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ దూకుడు పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు ఉన్న క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే, టీడీపీకి అంత సానుకూల ప‌వ‌నాలు అయితే వీచ‌డం లేదు. ఎందుకంటే, రాష్ట్ర వ్యాప్తంగా 130కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌క‌త్వ లేమి చాలా స్పష్టంగా క‌నిపిస్తోంది. నాయకులు ఉన్న చోట ఆధిపత్యపోరు నడుస్తుంది.

Chandrababu Naidu shows his frustration in front of people 

ఈ ప‌రిణామాలే గ‌త సాధార‌ణ‌ ఎన్నిక‌ల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక, ఇప్పుడు పంచాయ‌తీ పోరులోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్తితి ఎద‌ర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆ మాట‌కు వ‌స్తే 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు ఏ మాత్రం యాక్టివ్‌గా లేర‌ని చంద్రబాబు ఇటీవ‌ల స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ అద్భుతం చేస్తుంది అని అనుకోవడం ఆశపడటమే. బ‌హుశ ఈ విష‌యం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసిపోయిందో ఏమో వెంట‌నే ఆయ‌న ప్లేట్ మార్చారు.

టీడీపీ మెజారిటీ గ్రామ పంచాయ‌తీల‌ను రాబ‌ట్టుకోలేక పోయినా, లేక‌ వైసీపీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో లాగానే వార్ వ‌న్ సైడ్ చేసి భారీ సంఖ్యలో పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకున్నా, టీడీపీని ర‌క్షించుకునే మార్గం దిశ‌గా చంద్రబాబు ఆలోచ‌న చేశారు. అదే ఇప్పుడు పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ అనుకూలురు భారీ సంఖ్యలో పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంటే వైసీపీపై రెండేళ్లు రాకుండానే వ్యతిరేక‌త పెరిగిపోయింద‌ని, జ‌గ‌న్ పాల‌న‌కు వ్యతిరేక‌త‌గా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమ‌య్యారు. అదే స‌మ‌యంలో రేపు టీడీపీకి వ్యతిరేక‌త వ‌స్తే, బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు చేయిం చార‌ని.. ఎన్నిక‌ల్లో అవినీతి చోటు చేసుకుంద‌ని.. ఇలా జ‌గ‌న్‌పై నింద‌లు వేసేందుకు రెడీ అయ్యారు. మ‌రోవైపు, పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవాలు స‌హజం. అయితే.. ఇలా జ‌రిగేందుకు ఛాన్స్ ఇవ్వొద్దంటూ.. టీడీపీ నేత‌ల‌నే చంద్ర‌బాబు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.