చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారనే సంగతి తెలిసిందే. లోకేశ్ ను సీఎం చెయ్యాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నా ఆయన కలలు ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024లో చంద్రబాబు సీఎం అయ్యి లోకేశ్ అనధికార సీఎంగా పాలన సాగించేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రజల్లో కూడా లోకేశ్ పై సదభిప్రాయం కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే 2024 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ కు టీడీపీ నుంచి లభించే హామీలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తే మాత్రమే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని అలా జరగని పక్షంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా ఫలితం ఉండదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు టీడీపీలో లోకేశ్ కు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోంది.
ఎల్లో మీడియా సైతం లోకేశ్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ కు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలనే కోరిక ఉన్నా ఆ కోరిక నెరవేరడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే మాత్రం ఆ పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉందని మరి కొందరు చెబుతున్నారు.
లోకెశ్ పాలిటిక్స్ లో సక్సెస్ సాధించాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని లోకేశ్ గెలిపిస్తారో లేదో చూడాల్సి ఉంది. టీడీపీ జాతకం 2024 ఎన్నికల సమయానికి మారుతుందో లేదో చూడాల్సి ఉంది.