ఇతర రాష్ట్రాలపై దృష్టి పెడుతున్న చంద్రబాబు నాయుడు.. అదే తప్పు చేస్తున్నారా?

టీడీపీ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో టీడీపీ పుంజుకుంటుందని కూడా ఎవరూ భావించడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది. కేసీఆర్ లా చంద్రబాబు కూడా టీడీపీని జాతీయ స్థాయిలో పాపులర్ చేయాలని ప్రయత్నాలు చేశారు.

తెలంగాణలో టీడీపీలో కొత్త నేతలు చేరుతున్నారు. తెలంగాణలో టీడీపీ పుంజుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే స్థాయిలో చంద్రబాబు ఏపీపై దృష్టి పెట్టాల్సి ఉందని మరి కొందరు చెబుతుండటం గమనార్హం. చంద్రబాబు జాతకం వచ్చే ఎన్నికల్లో అయినా మారుతుందో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ మాత్రం టీడీపీకి భారీ షాకులు ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.

చంద్రబాబు టీడీపీని ఏపీకే పరిమితం చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయనుండగా కుప్పంలో ఫలితాలు అనుకూలంగా వస్తాయో లేదో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ మంగళగిరి నుంచి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు లోకేశ్ ను సీఎం చేయాలని కళ కంటుండగా ఆ కల తీరుతుందో చూడాల్సి ఉంది. జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా పవన్ మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటూనే అనుకూల ఫలితాలు వస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు.