అమరావతితో ముందుకెళితే వ్యతిరేకతే.. చంద్రబాబుకు అర్థమైందా?

మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల వల్ల నష్టమే తప్ప లాభం లేదనే విధంగా చంద్రబాబు కామెంట్లు చేశారు. అయితే అమరావతితో ముందుకెళితే నష్టమే తప్ప లాభం లేదని చంద్రబాబుకు ఇప్పటికే అర్థమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పేరెత్తటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు.

అమరావతి రైతులకు ప్రాధాన్యత ఇస్తే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమరావతి రియల్టర్లు సైతం చంద్రబాబు మారిన ప్రవర్తనపై ట్రోల్స్ చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమరావతితో ముందుకెళితే వ్యతిరేకతే అని చంద్రబాబు ఫిక్స్ కావడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో గెలవడానికి పొత్తులు మినహా మరో మార్గం లేదని భావించి బీజేపీ, జనసేన పార్టీలపై ఆధారపడుతున్నారు. అయితే ఆ పార్టీలు సైతం టీడీపీకి అనుకూలంగా రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధపడటం లేదనే సంగతి తెలిసిందే.

చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయో లేక రివర్స్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు 2024 ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించడం కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవడం లేదు.