రాజకీయంలో శాశ్వత శతృవులు ఉండరు అంటారు. ఇది అక్షర సత్యం. అసలు రాజకీయం అంటేనే అది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక ఏపీ రాజకీయాల్లో కీలకనేత , ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు అలా కాదు. ప్రత్యర్థులకు అందని ప్లాన్స్ వేయడంలో తనెప్పుడూ ముందే ఉంటారు. ఇక ఇన్నిరోజులు బీజేపీకి దూరంగా ఉండడంతో కాస్తో కూస్తో నష్టపోయింది టీడీపీ. ఇక మీదట ఆ నష్టాలు లేకుండా టీడీపీని ఎలా స్ట్రెంతెన్ చేయాలా అని ప్లాన్స్ వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
వచ్చే జనరల్ ఎన్నికలు, లేదంటే జమిలి ఎన్నికల్లోగా అంతా సెట్ చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. రామ తీర్థం ఇష్యూ నుంచే బీజేపీ, టీడీపీకి కాస్త దోస్తీ కుదరబోతుంది అనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఇంకాస్త టాక్ వస్తోంది. రాజకీయంలో శాశ్వత శతృవులు ఉండరు అంటారు కదా. అలాగే, పార్టీల స్టాండ్స్ ప్రకారం బీజేపీ, టీడీపీ కాస్త దూరంగా జరిగినా ఫ్రెండ్షిప్ ఎక్కడకీ పోలేదు.
అందుకే, త్వరలోనే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు మీట్ అవ్వబోతున్నారు అని తెలుస్తోంది. ఎలాగూ బీజేపీకి ఏపీలో బలం కావాలి. అధికారంలో ఉన్న జగన్ తో కలిస్తే.. ఆ పార్టీకి వచ్చేదేం ఉండదు. సో, టీడీపీతో కలిస్తే వారికి కూడా బెన్ ఫిట్ ఉంటుంది. బీజేపీ పుంజుకుంటోన్న పార్టీ కాబట్టి.. ఆ పార్టీతో కలిస్తే చంద్రబాబుకి కూడా బెన్ ఫిట్ ఉంటుంది. అందుకే, బీజేపీలో చక్రం తిప్పే, అమిత్ షాని మీట్ అయ్యి ఏపీలో చక్రం తిప్పాలని చూస్తున్నారట చంద్రబాబు. ఇప్పటికే మొన్నీ మధ్య టీడీపీ ఎంపీలు అమిత్ షాతో మీట్ అయ్యారు. కాస్త పాజిటివ్ సిగ్నల్సే ఉన్నట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న టార్గెట్ లు పెట్టుకుని.. ఇబ్బంది పడకుండా.. నేషనల్ పాలిటిక్స్ లో కూడా చక్రం తిప్పాలనేది చంద్రబాబు ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పుడప్పుడే.. నేషనల్ గా మరో పార్టీకి ఛాన్స్ లేదు. కాబట్టి చంద్రబాబు ఈ ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు.