టీడీపీలో వైకాపా విలీనం… చంద్రబాబా మజాకా?

గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం.. భవిష్యత్తు ప్రశ్నార్ధకం.. సమకాలీన రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఇదే అని అర్ధమవుతుంది! అయితే ఈ సమయంలో చంద్రబాబు మాత్రం… తాను “ఊ” అంటే టీడీపీలో వైకాపా విలీనం అయిపోద్దని చెబుతున్నారు.

అవును… చంద్రబాబు జోకులు ఎంత సీరియస్ గా ఉంటాయో చెప్పడానికి ఇది తాజాగా ఉదాహరణ. ఇప్పటికే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, బిల్ గేట్స్ కు కంప్యూటర్ నేర్పానని, బిల్ క్లింటన్ ని అమెరికా ప్రెసిడెంటునూ – అబ్ధుల్ కలాం ని ఇండియా ప్రెసిడెంటునూ చేసింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటుంటారు.

ఇదే క్రమంలో సెల్ ఫోన్ లైట్ ను తానే కగున్నట్లు చెప్పుకునే చంద్రబాబు… సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అయినా.. పీవీ సింధుకు ఒలెంపిక్స్ లో మెడల్ వచ్చినా అది తన విజన్ కి ఉన్న బలం అని చెప్పుకుంటుంటారు. అలాంటి చంద్రబాబు తాజాగా తనదైన శైలిలో స్పందించారు.

ఇందులో భాగంగా… తెలుగుదేశం పార్టీ ఏపీలో చాలా బలంగా ఉన్నదని.. టీడీపీ గేట్లు తెరవకుండా చాలా నిగ్రహం పాటిస్తుందని.. ఒక్కసారి గేట్లు తెరిస్తే వైకాపా ఎమ్మెయేలు మొత్తం టీడీపీలో చేరిపోతారని.. ఫలితంగా టీడీపీలో వైసీపీ విలీనం అయిపోతుందని చంరబాబు చెప్పుకొచ్చారు.

నవ్విపోదురుగాక నాకేటి అన్న చందంగా ముందుకుపోతున్న బాబు… పొత్తులకోసం ప్రాకులాడుతున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులకోసం తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే… టీడీపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నారు. ఇది వాస్తవం!!

ఇదే సమయంలో ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరక్క ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. మరికొన్ని చోట్ల జనసేన నాయకులతో నెట్టుకొస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే… టీడీపీలో చేరడం కోసం వైసీపీ నేతలు రెడీగా ఉన్నారని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది!!