చంద్రబాబు వెన్నుపోటు.! పవన్ కళ్యాణ్ మీకర్థమవుతోందా.?

కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కే కాదు, కాపు సామాజిక వర్గానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారు.! ఈ విషయమై కాపు సామాజిక వర్గంలోనే లోతైన చర్చ జరుగుతోంది.

‘కాపు యువత జనసేనాని వైపు నడుస్తున్నారు. కానీ, ఆ జనసేన అధినేతను చంద్రబాబు తన వైపుకు తిప్పుకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రత్యేకంగా వ్యూహాలు రచించాల్సిన అవసరం లేకుండానే, పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు.

ఈ క్రమంలో కాపు యువత అయోమయంలో పడిపోతోంది. ‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి.. కాపు సామాజిక వర్గానికి అధికార పీఠం దక్కాలి..’ అని కాపు యువత నినదిస్తోంది. చంద్రబాబు వుండగా, పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశమే లేదు.

పవన్ కళ్యాణ్ మాత్రం తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీతో జనసేన మైత్రి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్‌కి ఇబ్బందులేమీ లేకుండా పోతున్నాయ్.. అన్నది ఓ వాదన.

అసలు పవన్ కళ్యాణ్ వ్యూహమేంటోగానీ, కాపు సామాజిక వర్గానికీ.. పవన్ కళ్యాణ్‌కీ మధ్యన చంద్రబాబు మార్కు రాజకీయం చిచ్చు పెడుతోంది. ఇది ఓ రకంగా వెన్నుపోటు వ్యవహారం లాంటిదే.! అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణే.