Chandra Babu Naidu: ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణం చేస్తాను… మళ్లీ సీఎం పదవి పై బాబు కామెంట్స్?

Chandra Babu Naidu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిసాయి. ఇంకా అసెంబ్లీ సమావేశాలు చివరి రోజులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్‌ను వివరించారు. ఇందులో విజన్ 2027 కూడా ప్రకటించారు. అంటే 2027 నాటికి అమరావతి పోలవరం నిర్మాణ పనులు ఎలా ఉంటాయనే విషయాల గురించి కూడా ఈయన ప్రజెంటేషన్ ఇచ్చారు.

డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని.. మూడేళ్లలో అమరావతికి కచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు. ఇక పోలవరం పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తామని 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇకపోతే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే విషయంపై కూడా ఈయన అసెంబ్లీలో మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేస్తే మళ్లీమళ్లీ కూడా ప్రజలు వారినే ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తారని తెలియజేశారు. ఇక 2029 ఎన్నికలలో కూడా తానే ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని ఈయన తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు.. ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.

ఓకే రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు నిరంతరంగా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం హెల్తీ ,వెల్తీ,హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో పనిచేస్తుందని సీఎం తెలియజేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ ను మేము ముఖ్యమంత్రిగా చూడలేమా అంటూ జన సైనికులు కామెంట్లు చేయగా వైకాపా నేతలు కూడా ఈ విషయంపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.