తారక్ రాజకీయాల్లోకి వస్తే.. ఈ ఒక్క ప్రశ్నే వాళ్లను భయపెడుతోందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే పెద్దగా ప్రభావం చూపగలరో లేదో చెప్పలేం కానీ సరైన సమయంలో ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. కొన్నేళ్ల క్రితం జగన్ ఎలాంటి కష్టాలను అనుభవించారో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అదే తరహా కష్టాలను అనుభవిస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

తారక్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం పొలిటికల్ వర్గాల్లో అదో సంచలనం అవుతుంది. తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని ఎక్కడ తారక్ చెబుతారో అని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారు. వైసీపీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా ఉన్నా అది కేవలం ఆయన రాజకీయాల్లోకి రానంత వరకే అని చెప్పవచ్చు.రాజకీయాల్లోకి వస్తే తారక్ కు వైసీపీ నేతలు సైతం శత్రువులయ్యే ఛాన్స్ ఉంది.

అయితే వ్యక్తిగతంగా తారక్ ను విమర్శించడానికి తారక్ చేసిన తప్పులు పెద్దగా లేవు. తారక్ తను మోసపోయాడే తప్ప రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయలేదు. తనను నమ్ముకున్న వాళ్లలో ఎవరికీ తారక్ అన్యాయం చేయలేదు. తనపై నెగిటివ్ కామెంట్లు రాకూడదనే ఆలోచనతోనే గతంలోనే జగన్ ను కలిసే అవకాశం వచ్చినా కలవడానికి తారక్ ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ తారక్ పై ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తారక్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఏదో ఒకరోజు ఆయన సీఎం కావడం గ్యారంటీ అని మరి కొందరు చెబుతున్నారు. తాత పోలికలతో పాటు ఊహించని స్థాయిలో తెలివితేటలు ఉన్న తారక్ తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. తనపై విమర్శలు చేయడానికి కొంతమంది తొందరపడుతున్నా తారక్ మాత్రం సమయం వచ్చినప్పుడే ఆ విమర్శల గురించి స్పందించాలని భావిస్తుండటం గమనార్హం.