ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈమధ్య మతం పేరు విశేషంగా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రైస్తవ మతస్తుడు కావడంతో ఈ రగడ మొదలైంది. రాష్ట్రంలో మత మార్పిడులు ప్రోత్సహించబడుతున్నాయని భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేసింది. ప్రధానంగా సోము వీర్రాజు లాంటి నేతతో కలిసి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మత మార్పిడుల ఆరోపణలతో ప్రభుయత్వం మీద విరుచుకుపడ్డారు. ఇక పాస్టర్లకు 5000 రూపాయల కరోనా సహాయం అందించడం మీద పెద్ద దుమారమే రేగింది. కరోనా సమయంలో కూడ కార్యకలాపాలు సాగిస్తున్న పాస్టర్లు, అర్చకులు, ఇమామ్ లకు ప్రభుత్వం విపత్తు ఉపశమన నిధి కింద 5 వేల ఆర్ధిక సహాయం అందించింది.
అయితే ఈ సహాయం అందుకున్న వారిలో అర్చకుల కంటే పాస్టర్లు అత్యధికంగా ఉండటంతో గొడవ మొదలైంది. హిందూ జనమెక్కువగా ఉండే రాష్ట్రంలో క్రైస్తవ మత పాస్టర్లు ఇంట పెద్ద సంఖ్యలో ఎలా వచ్చారనే అనుమానం మొదలైంది. కేవలం విపక్షజాల్లోనే కాదు సామాన్య జనంలో కూడ అదే అనుమానం కలిగింది. ఉంటె గింటే అర్చకులు ఎక్కువగా ఉండాలి. కానీ ఈ పాస్టర్లు ఈ స్థాయిలో ఎలా వచ్చారని ఆరా తీయడం మొదలైంది. ఈ విషయాన్నీ లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మాట మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది.
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం ఇస్తుండటంతో క్రైస్తవులుగా మతం మారి నకిలీ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వం నుండి సహాయం అందుకుంటున్నారు. నిజానికి ఇది నిజమైన ఎస్సీ, ఓబీసీలకు చేరాల్సిన సహాయం. కానీ మతం మార్చుకుని దొంగ పాస్టర్లు వాటిని మింగేస్తున్నారు. దీంతో నిజంగా పాస్టర్లయిన వారికి చెడ్డ పేరు వాటిల్లుతోంది. ఇప్పుడు ఆ దొంగ పాస్టర్లు అందరి మీదా చర్యలు తీసుకోవాలని రాహస్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అంటే దొంత పాస్టర్ల నుండి 5 వేల రూపాయల సొమ్మును వెనక్కు తీసుకుంటారు కావొచ్చు. ఈ విషయాన్ని పట్టుకున్న విపక్షాలు ప్రధానంగా రాష్ట్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ నందు చాప కింద నీరులా మత మార్పిడి జరుగుతోందని దీని వెనుక పెద్ద శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.