మాజీమంత్రి అఖిలప్రియ పై కేసు నమోదు !

టీడీపీ మహిళా నేత , మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పోలీసులు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో కరోనా నిబంధనల మేరకు సెక్షన్‌–30 అమల్లో ఉన్నప్పటికీ అఖిలప్రియ జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారని, వాహనాల రాకపోకలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో అఖిల ప్రియ తో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

మాజీ మంత్రి అఖిల ప్రియ పై కేసు నమోదు – Latest Telugu Political News |  Telangana | Andhra Pradesh News

తుఫాన్, వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో ధర్నా చేశారు. నవంబర్‌ లో నివర్ తుఫాన్ కారణంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు పంటలను నష్టపోయారన్నారు. రైతులకు పరిహారం చెల్లించకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అఖిలప్రియ ధర్నాకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ధర్నాను విరమించాల్సిందిగా కోరారు.. ట్రాఫిక్ నిలిచిపోయిందని.. వెంటనే నిరసన విరమించాలని కోరారు. అలాగే ధర్నాకు అనుమతి లేదని చెప్పారు. పోలీసుల ధర్నా ఆపాలని కోరినా పట్టించుకోలేదు. తమ నిరసనను కొనసాగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.