ఆమధ్య పట్టిసీమలో అవినీతి. మొన్నటికిమొన్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో అక్రమాలు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ కుంభకోణం.. ఏంటివన్నీ ? ఏమిటంటే ఎటుచూసినా ‘పచ్చ అవినీతి స. వాటన్నింటికీ సారూప్యత ఏమిటంటే చంద్రబాబునాయుడు హయాంలో భారీగా జరుగుతున్న అవినీతి. ఇవన్నీ బయటకు ఎలా వచ్చాయంటే కేవలం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కారణంగానే. ఇపుడీ అంశంపైనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలో లేదుకానీ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు సిఎం అయినప్పటి నుండి అవినీతికి లాకులెత్తినట్లే కనబడుతోంది. అందుకనే ప్రతీ చిన్న అంశంపైనా నేరుగా చంద్రబాబుపైనే అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతికి అవకాశం ఉందన్న కారణంగా చాలా ప్రాజెక్టుల అంచనా వ్య యాలను ప్రభుత్వం పెంచేసింది. తనకు అత్యంత సన్నిహితులైన ఎంపిలు, మంత్రులు, నేతలకు లేదా వారి దగ్గర బంధువులకే ప్రాజెక్టులన్నింటినీ కట్టబెడుతున్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంచటంపై అక్కడక్కడ అధికారులు కుదరదంటున్నా వినకుండా పెంచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.
నాలుగన్నరేళ్లలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, వివిధ పథకాల అములులో జరుగుతున్న అవినీతిపై చర్చకు ఎన్నిమార్లు సవాలు విసిరినా చంద్రబాబు మాట్లాడటం లేదు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అవినీతి జరిగిందంటూ చెప్పి ఎదురుడాదితో కాలం నెట్టుకొస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలో వరుసగా కాగ్ ఇస్తున్న నివేదికలతో టిడిపి ఇబ్బంది పడుతోంది. మొదటగా పట్టిసీమ ప్రాజెక్టులో భరీ అవినీతి జరిగిందని కాంగ్ చెప్పింది. దాంతో రూజ 400 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ నివేదికలో చెప్పినపుడు సిఎం, మంత్రులు, నేతలు ఎవరూ నోరెత్తలేదు.
మొన్నటికిమొన్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వాన్ని కాగ్ కడిగిపారేసింది. కేవలం కాంట్రాక్టర్లు దోచిపెట్టటానికే ప్రభుత్వం నిబంధనలను మార్చేసిందంటూ మండిపడింది.
కాగ్ లెక్కల ప్రకారమే సుమారు రూ. 100 కోట్ల అవినీతి జరిగింది. నిర్మాణ వ్యయం అమరావతి ప్రాంతంలో రూ. 3500 కూడా లేని కాలంలో ప్రభుత్వం ఏకంగా రూ. 11 వేలు ఎందుకు చెల్లించిందంటూ బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు ఆరోపించటాన్ని బట్టి ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో అర్ధమైపోతోంది.
ఇక, తాజాగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన దోపిడిని కూడా కాగ్ స్పష్టంగా ఎత్తి చూపింది. అవినీతికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేస్తున్నట్లు ఫుల్లుగా అక్షింతలేసింది. కాగ్ చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది. పై ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం, మంత్రులు ఎదరుదాడి చేయటం అందరూ చూస్తున్నదే. మరి జరిగిన అవినీతిపై స్వయంగా కాగ్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా చెప్పినా మంత్రులు, నేతలు మాత్రం నోరెత్తటం లేదు.