Polavaram: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ శాఖలకు అలాగే నారా లోకేష్ శాఖలకు భారీ స్థాయిలో నిధులు కేటాయించారని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం గురించి కూడా మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ మాట్లాడుతూ..2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందని ఆయన తెలియజేశారు. అప్పటివరకు మనం పోలవరం కోసం ఎదురు చూడాల్సిందేనని తెలియజేశారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులను దాదాపు 73% పూర్తి చేసామని మిగిలిన పనులు పూర్తి కావాలి అంటే 2027 వరకు ఆగాల్సిందేనని వెల్లడించారు.
గత పాలకులు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని పయ్యావుల తెలిపారు. ఏటా దాదాపు 2000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నీళ్లను రాయలసీమకు మళ్ళిస్తామని కూడా తెలపడం… జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా పోలవరం బనకచర్ల అనుబంధ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టినట్లు మంత్రి గుర్తు చేశారు.
ఇలా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే మరో రెండు సంవత్సరాలు పాటు వేచి ఉండాల్సిందేనని వెల్లడించారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలకు కూడా బడ్జెట్ కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు ముఖ్యంగా తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలకు భారీగా నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది.