Polavaram: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అయితే రైతులకు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం పోలవరం కోసం మంజూరు చేసిన నిధులు అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు అంటూ కూటమి నేతలు పోలవరం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ఇకపోతే తాజాగా నేడు అధికారులతో కలిసి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇలా పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వ్యవహార శైలిని పూర్తిస్థాయిలో తప్పు పట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రాజెక్టు పనులకు పూర్తి అంతరాయం కలిగించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తిరిగి వేగవంతమవుతున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడమే మా ప్రభుత్వ లక్ష్యం అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పై తనకు ఉన్న అంకిత భావం ఏంటో తెలియజేశారు. గతంలో మా ప్రభుత్వ హయాంలోనే పోలవరం సుమారు 72% వరకు పనులు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల సుమారు 2,400 కోట్ల రూపాయలు అదనపు భారం మాపై పడుతుందని చంద్రబాబు తెలిపారు.