ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రాత పూర్వక అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అలానే వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. ఆగిన చోట నుంచే తిరిగి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నట్టు చెబుతున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని.. కొత్త షెడ్యూల్ ప్రకటించాలని మెజార్టీ పార్టీలు సూచనలు చేస్తున్నాయి.
అయితే అలా చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఎదురు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సూచనల తర్వాత ఎస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు ఎస్ఈసీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని.. కొత్త షెడ్యూల్ ప్రకటించాలని మెజార్టీ పార్టీల సూచిస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సూచనల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు ఎస్ఈసీ. అయితే ప్రస్తుతం ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే.