పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో కొత్తట్విస్ట్ చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను బదిలీచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దశలో.. ఉన్నతాధికారుల బదిలీ పట్ల అభ్యంతరం తెలిపారు.
ఒకవేళ బదిలీ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఇప్పుడు తెరపైకి కొత్తగా మరో వివాదం వచ్చి చేరినట్టు కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఎస్‌ఈసీ ఈ ఉదయం పేర్కొంది.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇకపై ఎంతమందిని బదిలీ చేసుకున్నా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్‌సీఈ ఈ ప్రకటన విడుదల చేసింది.