Bosta Satyanarayana: వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సిపి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈయన గతంలో పార్టీ మారబోతున్నారు అనే విషయం గురించి వార్తలు రావడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈయనని వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టి ఏకగ్రీవంగా తనని ఎంపిక చేసుకుని శాసనమండలిలోకి పంపించారు.
ప్రస్తుతం వైకాపా పార్టీ తరఫున ఈయన తమ వాదోపవాదనులను వినిపిస్తూ ఉన్నారు. ఇక ఈయన వైకాపా నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఓ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.బొత్స సత్యనారాయణ జనసేన ముఖ్యనేతలతో టచ్ లో ఉన్నారనీ, ఇటీవలి కాలంలో పలు సార్లు పవన్ కల్యాణ్ తోనూ ఫోన్లో సంభాషించారనీ వైసీపీ నిఘావర్గాలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇలా ఆయన పార్టీ వీడకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి అని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేసి, ఆలింగనం చేసుకోవటంతో బొత్స నేడో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని వైసీపీ నేతలలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను బొత్స ఆలింగనం చేసుకొని కరచాలం ఇచ్చినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మరి ఈ వార్తలపై సత్యనారాయణ స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయిన వైకాపా పార్టీ ముందు ముందు రాబోయే రోజులలో పార్టీ మనుగడకు కూడా కష్టమవుతుందని భావించిన సత్యనారాయణ రాజకీయాల పరంగా మరికొన్ని రోజులపాటు ఆయన కొనసాగాలి అంటే తప్పనిసరి పరిస్థితులలో పార్టీ విడాల్సి ఉంటుందని ఆలోచనలో ఉన్నారట. ఇలా పార్టీ మారాల్సి వస్తే జనసేనగూటికే ఈయన చేరుతారని అందుకే పవన్ కళ్యాణ్ తో తరచూ టచ్ లో ఉన్నట్టు సమాచారం.