మోడీ ఇస్తానంటే జగన్ వద్దన్నట్టు.. అంతేనా సుజనా ?

BJP MP Sujana Chowdary blaming YS Jagan, Chandrababu Naidu
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది.అనుకున్నట్టే ఏపీకి మొండిచేయి చూపించింది.  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల మీద వరాలు కురిపించి మిగిలిన రాష్ట్రాలను గాలికొదిలేశారు. ఈ బడ్జెట్ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల బడ్జెట్‌ అన్నట్టే ఉంది.  ఆయా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్టులు కేటాయించారు.  బెంగుళూరు, చెన్నై, నాగపూర్‌ మెట్రో రైల్‌ కోసం భారీగా నిధులు కేటాయించి విభజన హామీల్లో ఒకటైన విశాఖ, విజయవాడ మెట్రోను కనీసం ప్రస్తావించలేదు.  ఎంతగానో ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఊసే బడ్జెట్లో లేదు.  దీన్నిబట్టి 55 వేల కోట్ల అంచనా వ్యయం రావడం జరిగడ్ని అర్థమైపోయింది.  కడప, బెంగుళూరు రైల్వే లైను కేంద్రానికి గుర్తే లేదని అర్థమైంది.  ఇన్ఫ్రాస్ట్రక్చర్ విష్యం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  
 
BJP MP Sujana Chowdary blaming YS Jagan, Chandrababu Naidu
ఇక ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు అయితే ఎప్పటిలాగే నిర్లక్ష్యం చేయబడ్డాయి.  మొత్తం మీద ఈ బడ్జెట్ ఏపీకి పీడకలే అనవచ్చు.  కేంద్రం ఇంతలా రాష్ట్రాన్ని విస్మరించినా తప్పంతా వైసీపీ, టీడీపీల మీదే నెట్టేస్తున్నారు బీజేపీ నేతలు.  బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ జగన్‌ ఢిల్లీ వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జగన్‌ కేసులు ఉపసంహరణకు చేసే ప్రయత్నం.. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేయడం లేదు.  ప్రత్యేక ప్యాకేజీలో మంజూరు చేసిన 20 వేల కోట్లను కూడా తెచ్చుకోవడం రాష్ట్ర నేతలకు సాధ్యం కావట్లేదు అంటూ తప్పు మొత్తం పాలక, ప్రతిపక్ష పార్టీల ఆమీదకు నెట్టేశారు.  ఆనాడు చంద్రబాబును ప్రధానిని చేసి ఉన్నా, ఇప్పుడు జగన్ ను ప్రధానిని చేసినా హోదా అనేది అసాధ్యమని, నీతిఆయోగ్ వచ్చిన తర్వాత హోదా కుదరదని అన్నారు.  
 
ఆయన మాటలు వింటే ఢిల్లీలో మోడీ మూటల కొద్దీ డబ్బులు కుమ్మరించి పడేస్తే వాటిని మోసుకురావడం చేతకాక చంద్రబాబు, జగన్ చేతులెత్తేశారన్నట్టే ఉన్నాయి.  సరే రాష్ట్ర పాలకులకు రాష్ట్రానికి కావల్సినది ఎలా అడగాలో, తెచ్చుకోవాలో చేతకావట్లేదనే అనుకుందాం.  మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు.  కేంద్రానికే గనుక నిజాయితీ ఉంటే ఇదిగో బాబు.. మీకిది కావాల్సింది ఇది.  మీకు అడగడడం చేతకావట్లేదు.  మీ అవసరాన్ని గుర్తించి మేమే ఇస్తున్నాం  తీసుకోండి అనొచ్చు కదా.  ఎందుకు అనరు.  అంటే.. నోట్లో నాలుక లేని వారిని నానబెట్టడం బీజేపీ ప్రభుత్వ వైఖరి కాదా.  ఎన్నికల సమయానికి అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు.  ఆ తర్వాత కనీసం పట్టించుకోరు.  అదే తమిళనాడు, బెంగాల్, కేరళ తరహాలో ఏపీలో కూడ ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు గనుక ఉండి ఉంటే ఇచ్చేరు ఇవ్వకపోయేరు బడ్జెట్లో మాత్రం ఇస్తామనే కేటాయింపులు భారీగా జరిగేవి.