భీమిలీ లో పెను విషాదం… కబడ్డీ ఆడుతూ మృత్యువాత పడిన యువకుడు…!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానం వల్ల ప్రజల జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాలలో క్షణాల ముందు వరకు బాగున్నాం మనుషులు జనాలలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొంతకాలంగా ఇలాంటి ఆకస్మిక మరణాలు రేటు రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల కబడ్డీ ఆడుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన భీమిలీ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే… భీమిలీ జిల్లాలోని పూసపాటిరేగ మండలం యోరుకొండల గ్రామానికి చెందిన యువకులు న్యూ ఇయర్‌ సందర్భంగా సరదగా కబడ్డీ పోటీ పెట్టుకున్నారు. యువకులంతా కబడ్డీ ఆడుతున్న సమయంలో రమణ అనే యువకుడి ని పట్టుకోవటానికి ఇతర జట్టు యువకులంతా రమణ పై పడ్డారు. అందరూ అలా మీద పడటంతో రమణకు ఊపరి ఆడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రమణ పరిస్థితి గమనించిన తోటి ఆటగాళ్ళు వెంటనే అప్రమత్తమైన అతన్ని కేజీహెచ్‌కి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు రమణ.

ఇలా సరదాగా ఆట ఆడటానికి వెళ్లిన కొడుకు ఇలా శివమై తిరిగి రావటంతో రమణా తల్లిదండ్రుల రోదన మిన్నటుతోంది. రమణ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటలో తోటి ఆటగాళ్లు మీద పడటంతో ఊపిరాడక చనిపోయాడా? లేదంటే ఆటలో ఇంకేదైనా జరిగిందా అన్న అనుమానాల మధ్య పోస్టుమార్టం నిమిత్తం రమణ డెడ్‌బాడీని కేజీహెచ్‌కు తరలించారు. అప్పటిదాకా సరదాగా తమతో కలిసి ఉన్న రమణ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో అతని స్నేహితులు కూడా తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఈ విషయం గురించి సమచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని అక్కడివారికి విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.