ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీమ్ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి కేసు గతంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి సంస్థ భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ అలిగేషన్స్ చేసారు. దీనిపై విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై రెస్పాండ్ అయిన నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా పంపింది. కానీ రామోజీరావు హై కోర్టు, తర్వాత సుప్రీమ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి స్టే మీద ఉన్న కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యమైన కేసులు ఉంటె 6 నెలలకు మించి స్టే కొనసాగించరాదు అని సుప్రీం కోర్టు తీర్పు. దీనికి అనుగుణంగా మార్గదర్శి కేసు బయటకు వచ్చింది.
కాగా ఈ స్టేను ఇంకొంతకాలం పొడిగించాలంటూ రామోజీరావు సుప్రీమ్ కోర్టును వేడుకున్నారు. ఆయన డిమాండ్ ను సర్వోన్నత న్యాయస్థానం తిప్పి కొట్టింది. స్టే పొడిగించటానికి అంగీకరించలేదు. మార్గదర్శి కేసుపై స్పందించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్ కుమార్ కి సుప్రీమ్ కోర్టు నోటీసులు పంపింది.