రోజాకు టికెట్ వద్దని చెబుతున్న వైసీపీ నేతలు.. జగన్ అంగీకరిస్తారా?

ఏపీ రాజకీయల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న రోజా ఈ మధ్య కాలంలో తరచూ ఇతర రాజకీయ నాయకులకు టార్గెట్ అవుతున్నారు. కారణాలు ఏవైనా రోజాకు శత్రువుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజాకు మంత్రి పదవి ఇవ్వకూడదని కొంతమంది ఆమెను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలంలో ఆలయ ఛైర్మన్ రోజాకు స్వాగతం పలకాల్సి ఉండగా స్వాగతం లభించలేదు.

చివరకు ఈవో లాంఛన కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. రోజాకు కనీసం ప్రోటోకాల్ మర్యాద కూడా దక్కకపోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవద్దని జగన్ కు సూచనలు చేశారని సమాచారం అందుతోంది. రోజాకు పొలిటికల్ గా షాక్ తగిలితే ఆమె పొలిటికల్ కెరీర్ కు దెబ్బ అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

రోజా రాజకీయంగా మరింత సక్సెస్ కావాలని భావిస్తుండగా ఆమె స్వభావం వల్ల ఆమెకు శత్రువుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజా టికెట్ వద్దని నేతలు చేస్తున్న ఫిర్యాదుల విషయంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రోజా కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన తరుణం ఆసన్నమైందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ కామెంట్ల విషయంలో రోజా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రోజా భవిష్యత్తులో సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా లేదని సమాచారం అందుతోంది. నగరి నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం కూడా రోజాకు మైనస్ అవుతోంది. రోజా తన పొలిటికల్ కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.