బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ‘శుభం’ కార్డు !

The TDP engages in conspiratorial politics during panchayat elections

రాష్ట్రంలో తాజాగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన విజయాన్ని అందుకుంది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో ఏదోరకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చతికిలపడ్డారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు తన ద్వారా లబ్ధి పొందినవారితో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినా అరకొర స్థానాలకే పరిమితమయ్యారని, తెలుగుదేశం పార్టీ సినిమా ముగిసిందన్నారు. 

tdp

ఇక చంద్రబాబు టైమ్ అయిపోయిందని, టీడీపీ శ్రేణులే చంద్రబాబును నమ్మడం లేదన్నారు. సీఎం జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఏర్పడిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఇదే ప్రతిబింభించిందని చెప్పుకొచ్చారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్సీపీని విమర్శించిన చంద్రబాబు.. రెండో ఫలితాలు వెలువడగానే ఎన్నికల కమిషన్‌ ను విమర్శించారన్నారు. ఇప్పుడు నాలుగో విడత ఫలితాలు వెలువడగానే 50 శాతం తామే గెలిచామని చెప్పుకుంటున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. ఒక్కో విడతలో ఒక్కో విధంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికల్లో నెగ్గినట్లుగానే త్వరలో జరగనున్న పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ వైయస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపల్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన పార్టీ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉన్నట్లు.. వైయస్సార్సీపీ గెలిస్తే.. అక్రమాలు జరిగినట్లు చెప్పడం చంద్రబాబు నైజమని విమర్శించారు.