బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?


కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ) అనారోగ్యంతో మరణించడంతో బద్వేలు అసెంబ్లీ నియోజకర్వగం ఖాళీ అయ్యింది. కాగా, సిట్టంగ్ ఎమ్మెల్యే సతీమణి సుధ, వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఆమె గత కొద్ది కాలంగా నియోజకవర్గంలో పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, టీడీపీ నుంచి ఓబుళాపురం రాజశేఖర్ పేరు ఇప్పటికే ఖరాయ్యింది. అయితే, ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం తర్వాత, విపక్షాలేవీ రాష్ట్రంలో అధికార వైసీపీకి పోటీ ఇచ్చే స్థాయిలో లేవన్న విషయం సుస్పష్టమైపోయింది. లోక్ సభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు.. ఇలా అన్నిటిలోనూ విపక్షాలు చతికిలపడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా, బీజేపీ – జనసేన కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు.? అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. జనసేన షరామామూలుగానే ఈ నియోజకవర్గాన్ని కూడా బీజేపీకే వదిలి పెట్టేస్తుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. అయితే, తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చిందనీ, మరోమారు బదనాం అయ్యేందకు బీజేపీ సుముఖంగా లేదనీ అంటున్నారు. అదే గనుక జరిగితే, జనసేన పార్టీ బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి దిగడం ఖాయమే కావొచ్చు. అలా జరిగినా, జనసేన కనీస ప్రభావమైనా బద్వేలు ఉప ఎన్నికలో చూపకపోవచ్చు. ఆ పార్టీ ఇప్పటికప్పుడు అభర్యిని వెతుక్కోవాల్సి రావడమంటేనే.. ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చ. వైసీపీ – జనసేన మధ్య మాటల యుద్ధం, దూషణల యుద్ధం జరుగుతున్న దరిమిలా, పవన్ కళ్యాణ్.. పట్టుదలకు పోయి అయినా అభ్యర్థిని నిలబెడతారా.? అన్నది వేచి చూడాల్సిందే.