Auto Drivers Attack Devotees: తిరుపతిలో భక్తులపై ఆటో డ్రైవర్ల దాడి

తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఆటో ఛార్జీల విషయంలో తలెత్తిన వివాదం భక్తులపై దాడికి దారితీసింది. అధిక ఛార్జీ అడిగిన స్థానిక ఆటో డ్రైవర్‌ను కాదని, రాపిడో ఆటోను బుక్ చేసుకోవడమే ఈ గొడవకు ప్రధాన కారణం.

ఒంగోలుకు చెందిన భక్తులు శ్రీనివాసమంగాపురం వెళ్లేందుకు స్థానిక ఆటో డ్రైవర్ సమీర్‌ను సంప్రదించగా, అతను రూ. 800 ఛార్జీ చెప్పాడు. ఛార్జీ ఎక్కువని భావించిన భక్తులు, ‘రాపిడో’ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ఆ రాపిడో ఆటోలో పరిమితికి మించి 8 మంది ఎక్కడంతో, స్థానిక ఆటో డ్రైవర్ సమీర్ ప్రశ్నించాడు. ఇది వాగ్వాదానికి దారితీసింది.

మాట మాట పెరిగి, ఈ వాగ్వాదం ముదరడంతో ఆటో స్టాండ్ అధ్యక్షుడు బాలకృష్ణ, ఇతర డ్రైవర్లు కలిసి భక్తులపై, రాపిడో డ్రైవర్‌పై దాడి చేశారు.పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు ఈ విధంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దాడికి పాల్పడిన సమీర్‌ను అరెస్ట్ చేసి, అతని ఆటోను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వార్2 Vs కూలీ | Cine Critic Dasari Vignan On War 2 Vs Coolie Comparison | Jr NTR Vs Rajinikanth | TR