ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం … ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

ys jagan not hapy with those ministers work

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటివి పునారవృతం కాకుండా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap cm ys jagan wrong decision on cbi investigation

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. 20 మంది సభ్యులుండే ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులుగా ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరుసగా జరుగుతున్న ఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుందని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. మత సామరస్యం దెబ్బతినేలా చేస్తున్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని… అందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీఓ నెంబర్ 6 విడుదల చేశామని తెలిపారు. అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయని… ఈ కమిటీలకు ఎలాంటి కాల పరిమితి లేదని వెల్లడించారు