కర్ణాటక ఫలితాలపై అచ్చెన్న కామెంట్… జనసైనికుల్లో కొత్త టెన్షన్!

సరిగ్గా అవసరమైన సమయంలో అద్భుతమైన విజయం దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. కీలక సమయంలో కర్ణాటకలో విక్టరీ కొట్టి.. దేశం చూపు తనవైపు తిప్పుకుంది. దీంతో ప్రతీరాష్ట్రంలోనూ అధికారపార్టీపై విమర్శలు చేయడానికి… కర్ణాటక ఫలితాలను ఉదాహరణలుగా తీసుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇందులో భాగంగా మైకందుకున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని.. అక్కడ బీజేపీ ఓడిపోయినట్లే ఇక్కడ బీఆరెస్స్ ఇంటికెళ్లిపోద్దని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై అచ్చెన్నాయుడూ స్పందించారు. ఏపీలో కూడా కర్నాటక ఫలితాలే వస్తాయని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ గెలవడం ఖాయమని చెబుతున్నారు.

దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నా నెటిజన్లు… మధ్యలో జనసేనను తీసుకువస్తున్నారు. అచ్చెన్న మాటలకు రిప్లై పెడుతున్న నెటిజన్లు…. మరి జనసేన పరిస్థితి మరో జేడీఎస్ అని మీ ఉద్దేశ్యమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ.. అది కూడా సింగిల్ గా. అలాంటప్పుడు… పొత్తుతో ముందుకు వెళ్తున్న టీడీపీ… జనసేనను పరోక్షంగా జేడీఎస్ తో పోలుస్తుందా అని కౌంటర్స్ వేస్తున్నారు.

ఇవన్నీ చూస్తుంటే… పొత్తుకు గనుక ఏపీ జనాలు మద్దతు పలికి, టీడీపీకి సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారిటీ ఇస్తే… జనసేనను పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు జనసైనికులు. అందుకే… సీట్ల సంఖ్య విషయంలో తగ్గొద్దని ఆన్ లైన్ వేదికగా పవన్ కు రిక్వస్టులు పెడుతున్నారు. కనీసం 75 స్థానాలు జనసేన తీసుకుని, టీడీపీకి 100 సీట్లు వదలాలని… అలాకానిపక్షంలో బాబు ఎలాగైనా మారే ప్రమాధం ఉందని ఆన్ లైన్ వేదికగా పవన్ కు సూచిస్తున్నారు.

మరి చంద్రబాబుని పీకదాకా నమ్ముతున్న పవన్… జనసైనికుల సూచనలను పరిగణలోకి తీసుకుంటారా.. లేక, జనసైనికుల సూచనలకంటే చంద్రబాబు మాటకే అధిక విలువ ఇస్తారా అన్నది వేచి చూడాలి!