మహానాడు స్పెషల్: అచ్చెన్న సెల్ఫ్ గోల్… మామూలు హాస్యం కాదిది!

అంగరంగ వైభవంగా ప్రారంభమై.. ఫుల్ సీరియస్ ప్రసంగాలతో నడుస్తున్న మహానాడు వేదికపై అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రసంగం మొత్తం సీరియస్ గా జరిగినా… అనంతరం ఆన్ లైన్ వేదికగా సాగుతున్న విశ్లేషణలు, కొన్ని లాజికల్ ప్రశ్నలు తెగ హాస్యాన్ని పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రసంగానికి సంబంధించిన ఆన్ లైన్ కౌంటర్స్ వైరల్ గా మారుతున్నాయి.

మహానాడు వేదికపై మైకందుకున్న ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని తేల్చి చెప్పారు. సరే ఇలా ఆశాభావం వ్యక్తం చేయడం తప్పేమీ కాదు కానీ… గడిచిన ఎన్నికల్లో 151 స్థానాలు రావడంతో జగన్ కళ్లు నెత్తికెక్కి ఒళ్లు మదమెక్కిందని మండిపడ్డారు. దీంతో… 151 స్థానాలు వచ్చిన జగన్ కే కళ్లు నెత్తికెక్కడం, ఒళ్లు మదమెక్కిపోవడం జరిగితే… ఇక 160 వస్తే అచ్చెన్నకు (ఇంకా) ఎంత మదమెక్కిపోద్దో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు!

దీనికి అనుబంధంగా కౌంటర్ పడేలా మరో వ్యాఖ్య చేశారు అచ్చెన్న. “తాజాగా జగన్ సెంటు పట్టా ఇచ్చారు. నా లాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..? అలోచించండి!” అనేది అచ్చెన్న నోటినుంచి జాలువారిన మరో పెద్ద ప్రశ్న. దీంతో… 23 స్థానాలు ఉన్నప్పుడే ఒక సెంటు సరిపోకపోతే… రేపు 160 వస్తే అచ్చెన్న పర్సనాలిటీ సరిపోవడానికి ఎన్ని ఎకరాలు కావాలో అంటూ మరో కౌంటర్ కామెంట్!

ఈ ఫ్లో మరింత కంటిన్యూ చేసిన అచ్చెన్న… 30 కేజీలున్న జగన్‌ కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? అంటూ తమ్ముళ్లను ప్రశ్నించారు అచ్చెన్న. దీంతో జగన్ వెయిట్ కు మిషన్ ఉంది కాబట్టి 30 కేజీలు అని తేలిపోయింది… అచ్చెన్న కు ఆ ఛాన్స్ లేదు… మిషన్ ముళ్లులు ఇరిగిపోతున్నాయంట.. అంటూ గ్యాప్ లేకుండా కౌంటర్స్ ఇస్తున్నారు నెటిజన్లు.

ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయమున్న నేపథ్యంలో… “పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, గత పాలనపై ప్రజలకు చెప్పాల్సిన క్షమాపణలు, రాబోయే రోజులపై జనాలకు కలిగించాల్సిన నమ్మకాలు”.. గురించి చర్చించడానికి మహానాడు అని చెప్పి… ఇలా రెగ్యులర్ ప్రెస్ మీట్లలో చెప్పే ఊకదంపుడు విమర్శల వల్ల పార్టీకి, కేడర్ కూ ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు మహానాడుకు హాజరైన తమ్ముళ్లు! మరి ఆ తమ్ముళ్లకు ఉన్న ఆలోచన కూడా ఏపీ టీడీపీ చీఫ్ కి లేకపోవడం దురదృష్టమే!!