ఒకే ఒక్కడు జగన్ సర్కార్ మీద వీరోచిత పోరాటం చేస్తున్నాడు

AP Venkataeswararao condemns AP government suspension orders 
ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఏపీ ప్రభుత్వం మీద కోర్టుల్లో పోరాటం చేస్తుంటే మరొక ముఖ్యుడు కూడా అదే రీతిన ముందుకు వెళుతున్నారు.  చంద్రబాబు హయాంలో ఏ నాయకులు, అధికారులు అయితే ఎగిరెగిరి పడ్డారో వాళ్లంతా ఇప్పుడు రకరకాల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  ప్రభుత్వ చర్యలు, కేసులను ఎదుర్కొంటున్నారు.  వారిలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ  వెంకటేశ్వరరావు కూడ ఉన్నారు.  ఇజ్రాయిల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏబీ  వెంకటేశ్వరరావును విధుల నుండి తొలగించి సస్పెండ్ చేసింది ప్రభుత్వం.  వీలైనంతవరకు ఆ సస్పెన్షన్ వేటును కొనసాగించాలని చూస్తోంది.  
 
AP Venkataeswararao condemns AP government suspension orders 
AP Venkataeswararao condemns AP government suspension orders
2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం అప్పటి ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు నేటి ప్రభుత్వం ఆరోపించింది.  ఆయన వలన ప్రభుత్వానికి 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, దేశభద్రత విషయంలో ఆయన రాజీపడ్డారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది ఏపీ ప్రభుత్వం.  అయితే వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లి తన సస్పెన్షన్ మీద స్టే తెచ్చుకున్నారు.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు మరోసారి నోటీసులు పంపింది.  దీంతో మళ్ళీ కోర్టుకెక్కిన వెంకటేశ్వరరావు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు.  కోర్టు ఆయనకు అనుకూలంగానే అరెస్ట్ చేయకూడని, విచారణ ఉంటుందని తెలిపింది.  
 
అయితే తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉన్నట్టుండి ఉత్తర్వులు ఇచ్చింది.  మరో ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉంటుందని, గతేడాది ఆగష్టు నుండే అమలులో ఉన్నట్టని పేర్కొంది.  గతంలో సస్పెషన్ వేయగానే ఏబీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కు వెళ్లారు.  కానీ ఆయన్ను సస్పెండ్ చేయడానికి స్పష్టమైన ఆధారాలున్నట్లు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.  సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలన్న పిటిషన్ ను కూడా కొట్టేసింది.   సస్పెన్షన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం   సుప్రీం కోర్టుకు వెళ్ళింది.  అయితే ఈసారి ఇచ్చిన సస్పెన్షన్ పొడిగింపు మీద ఏబీ తీవ్రంగానే స్పందిస్తున్నారు.  కావాలని సస్పెండ్ చేసి జీతం రాకుండా చేసి తనకు వేధిస్తున్నారని, తన వలన ప్రభుత్వానికి రూపాయి కూడ నష్టం జరగలేదని, ఆలు నగదు లావాదేవీలే లేని చోట తనపై ఆరోపణలు మోపి, అరెస్ట్ చేసి, సస్పెండ్ చేయాలని చూస్తున్నారని గట్టిగా వాదిస్తున్నారు.  కోర్టులో పిటిషన్ కూడ వేశారు.  చూడబోతే ఈయన కూడ భవిష్యత్తులో మరొక నిమ్మగడ్డ అయ్యేలా ఉన్నారు.