వైసీపీలో అసమ్మతి సెగ లేచిన మాట వాస్తవం. సొంత పార్టీ మంత్రులు..ఎమ్మెల్యేలే జగన్ పై గుసాయించిన ఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి. అధికారులు తాము చెప్పింది చేయలేదని..తమ నియోజక వర్గాల్లో తమ ఆదేశాలు చెల్లుబాటు కావడం లేదని ఇప్పటికే పలు ఆరోపణలు ప్రభుత్వంపై గుప్పించే ప్రయత్నాలు చేసారు నేతలు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా కథనాలు వేడెక్కించాయి. ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన కొందరు నేతలు టీడీపీకి కోవర్టుల్లా పనిచేస్తున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి వివాదాస్పద అంశాల్ని ప్రతిపక్ష పార్టీ టీడీపీ తమకు అనుకూలంగాను మార్చుకుంటోంది. వీలైనంత రాజకీయం చేసి వైసీపీని ప్రజల్లో వీక్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఓ మంత్రి విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని తెరపైకి వచ్చింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఆ మంత్రి ముందు చంద్రబాబు పేరెత్తితో ఒంటికాలుపై లేచిపడతారు. టీడీపీ పార్టీ అయినా..ఆ పార్టీ నేతలన్నా సదరు మంత్రి వర్యులు భగ్గుమంటారు. విమర్శలకు ప్రతి విమర్శలు..ఆరోపణలకి ప్రత్యారోపణలు చేయడం ఆ మంత్రికే చెల్లింది. అతను చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మంత్రి కావడం కూడా మరో విశేషం.
అయినా చంద్రబాబును వదిలిపెట్టనంటూ అవకాశం చిక్కినప్పుడల్లా మీడియా ముందు డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అతి చేస్తే ఎక్కడైనా..ఎప్పుడైనా తేడా కొట్టే అవకాశం లేకపోలేదుగా. సరిగ్గా ఆ ఓవరేక్షనే ఇప్పుడా మంత్రి పదవికే ఎసరు పెట్టేలా ఉందని ఓ వార్త తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అతన్ని బర్త్ రఫ్ చేయడానికి సన్నధం అవుతందిట. జగన్ కి ఎంత విధేయడుగా ఉన్నా సమయం..సందర్భం లేకుండా ప్రత్యర్ధలపై దాడి చేయడం..అర్ధం లేని వ్యాఖ్యలు అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బంది కరంగా మారుతున్నాయట. ఆకారణంగా మంత్రిని పదవి నుంచి తప్పించాలని చూస్తున్నట్లు లీకులందుతున్నాయి. అయితే అది జరిగే పని కాదని ..జగన్ మోహన్ రెడ్డి అతన్ని చాలా గొప్పగా ఊహించుకుంటున్నారని..అవసరమైతే ప్రమోషన్ ఇస్తారు తప్ప డిమోషన్ ఎందుకు చేస్తారని అన్నవారు లేకపోలేదు.