ఏ ముహూర్తాన సీఎం జగన్ కు.. నిమ్మగడ్డ కు మధ్య ఇష్యూ సీరియస్ అయిందో కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇద్దరూ ఇద్దరే అంటే నమ్మండి. నిన్న మొన్నటి దాకా. నానా కష్టాలు పడిన నిమ్మగడ్డ.. నిస్సహాయంగా ఒంటరి పోరు చేశారు. ఇప్పుడు మాత్రం వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఉన్నట్టుండి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి రాయలసీమ పర్యటన ఎందుకు పెట్టుకోవాలి అనిపించిందో మరి. లేదంటే సీమ ఏమైనా ప్రాబ్లమేటిక్ ఏరియా అనుకున్నారా. లేదంటే బెదిరింపులు గట్రా ఎక్కువ ఉంటాయి అనే లెక్కలతో ఏమైనా పర్యటిస్తున్నారా అర్దం కావడం లేదు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని చూస్తుంటే మాత్రం.. రాయలసీమపై ఏదో సీరియస్ రిపోర్ట్ తీసుకుని బయల్దేరినట్లే ఉంది. ఏవో ఇన్ఫర్మేషన్లు.. ఇంటలిజెంట్ రిపోర్టులు ఏమైనా ఉన్నాయో ఏమో మరి. మొత్తానికైతే, ఎన్నికల టైంలో నిమ్మగడ్డ పర్యటన సీరయస్ టాపిక్ అయింది. రెండు రోజుల పాటు, రాయలసీమలో పర్యటిస్తున్నారు నిమ్మగడ్డ. ఈ రోజు శుక్రవారాం నాడు.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటన ఉంటుంది.
రేపు శనివారం నాడు కడప జిల్లాలో నిమ్మగడ్డ పర్యటన ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట నిమ్మగడ్డ రమేశ్ కుమార్. పనిలో పనిగా.. ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ లు కూడా ఏర్పాటు చేసి ఎన్నికలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. అవి ఎంత వరకు పక్కాగా ఉన్నాయో అని తెలుసుకుంటారట. రాయలసీమపై గట్టిగానే ఫోకస్ చేసినట్లున్నారు నిమ్మగడ్డ. ఆఫీసర్లకి కూడా టెన్షన్ తప్పడం లేదట. ఏమో ఏ మాత్రం తేడా వచ్చినా, పదవికి ప్రాబ్లమ్ తప్పదు. పోనీలే కొన్నాళ్లేగా సస్పెన్షను.. లాంగ్ లీవ్ అనుకుందాంలే అని లైట్ తీసుకుంటేనేమో.. ప్రమోషన్లు లాంటి టైంలో ఎఫెక్ట్ పడుతుంది