మన రాజకీయం దేవుళ్ళు, ఆలయాలను దాటి ఆవుల దగ్గరకొచ్చింది 

AP politics in critical condition 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాణ్యత ఎప్పుడో లోపించింది.  ఇప్పుడు నైతికత కూడ లోపిస్తోంది.  ఇన్నాళ్లు కులం, వర్గం మీద నడిచిన పార్టీలు, నాయకులు ఇప్పుడు దేవుళ్ళు, దేవాలయాలు, మతాలు అంటున్నారు.  ఎన్నడూ లేని విధంగా మన పార్టీలకు దేవుళ్ళ మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది.  టీడీపీ, బీజేపీలకు  హిందూత్వం తన్నుకొచ్చేస్తోంది.  వైసీపీకి దేవాలయాల మీద శ్రద్ద వంద రెట్లు పెరిగిపోయింది.  ఆలయాల మీద జరుగుతున్న దాడుల అంశాన్ని రాజకీయంగా గట్టిగా వాడుకోవాలని భావించిన ప్రతిపక్షాలు మతాన్ని తెరమీదకు తెచ్చి జగన్ క్రిస్టియన్ అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో హిందూత్వం  మంటగలిసి పోతోంది అంటూ బీజీపీ, టీడీపీలు గోల గోల చేస్తున్నాయి. 

AP politics in critical condition 
AP politics in critical condition

వైఎస్ జగన్ సైతం దాడుల్లో అసలు నిందితులను, వారి వెనుక ఉన్న కుట్రదారులను కనిపెట్టాల్సింది పోయి టీడీపీ, బీజేపీల తీరులోనే వెళ్తున్నారు.  దేవాలయాల వైపు నుండి దెబ్బకొడుతున్నారు కాబట్టి తనకు దేవుళ్ళ మీద ఉన్న భక్తిని, దేవాలయల్ మీదున్న శ్రద్ధను నిరూపించుకోవడానికి గతంలో కూల్చబడిన ఆయాలయాలకు శంఖుస్థాపనలు చేసి ప్రచారంతో హోరెత్తించారు.  అందులో భాగంగానే తాజాగా సంక్రాంతి  సందర్బంగా తిరుపతిలో జరిగిన గోపూజకు హాజరై గోమాతలకు పూజలు చేశారు.  నిజానికి ఇలా గోవులకు పూజలు చేయడంలో తప్పేమీ లేడీ.  పలానా మతం వారే గోవులను పూజించాలని ఎక్కడా రాసిలేదు. 

కానీ టీడీపీ మాత్రం జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయనకసలు గోవులను పూజించే హక్కే లేదని, రాతలు తగలబెట్టి, గుళ్లను కూల్చి ఇప్పుడు పూజలు చేస్తారా అంటూ మాట్లాడుతున్నారు.  జగన్ ఏమో ఆత్మరక్షణ కోసం ఇలా గోపూజలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం గోవులను పూజించి హక్కు జగన్ కు లేదని వాదిస్తున్నారు.  అసలు హక్కులను డిసైడ్ చేయడానికి వీరెవరో మరి.  ఇలా రాష్ట్ర రాజకీయం ఆలయాలు, దేవుళ్ళు మీదుగా వచ్చి  ఇప్పుడు ఆవుల వద్దకు చేరుకుంది.  చివరికి నోరులేని మూగ జీవాలను కూడ రాజకీయ క్రీడలో భాగం చేసేశారు.  ఇన్నాళ్లు ఉత్తరాదికి పరిమితమైన ఈ పైత్యం మన వరకు పాకింది.  మరి గోవుల నుండి వీటి మీదకు టర్న్ తీసుకుంటారో మన నాయకులు.