ఏపీలో ఏ రాజకీయ పార్టీ ప్రజలకు ఇష్టం లేదా.. కొత్త పార్టీ కావాల్సిందే?

YCP should also be disgraced like the Teresa party

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ప్రధాన పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. జనసేన పార్టీ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపుతుండగా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం ప్రభావం చూపే విషయంలో ఫెయిల్ అవుతుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఏపీలో ఉన్నా ఈ పార్టీలకు సమర్థవంతమైన నాయకులు లేకపోవడం ఈ పార్టీలకు మైనస్ అవుతోంది.

అయితే ఏపీలోని ప్రజలకు ఈ పార్టీలలో ఏ పార్టీ కూడా నచ్చడం లేదు. ఈ పార్టీలు కాకుండా మరో కొత్త పార్టీ వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఏపీలోని ప్రతి రాజకీయ పార్టీ కొన్ని తప్పులు చేస్తోంది. ఆ తప్పులు ప్రజలకు తెలుస్తున్నాయని ఆ పార్టీ నేతలకు తెలిసినా ఆ తప్పులను సరిదిద్దుకోవాలని పార్టీలు ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ పథకాలను అమలు చేస్తున్న అభివృద్ధి విషయంలో ఫెయిల్ అవుతోంది.

టీడీపీ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు విషయాలలో ఫెయిల్ అవుతోంది. జనసేన పార్టీ విషయానికి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కనీసం మేనిఫెస్టోను కూడా ప్రకటించలేని విచిత్రమైన పరిస్థితిని ఈ పార్టీ ఎదుర్కొంటోంది. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ వస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు సైతం భావిస్తుండటం గమనార్హం.

అయితే కొత్త పార్టీ వచ్చినా ఆ పార్టీ ప్రజల సంక్షేమం కోసమే కృషి చేయాలని స్వార్థపూర్తిత రాజకీయాల కోసం పని చేసే పార్టీలు తమకు అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రాబోయే రోజుల్లో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.