ఒకే ఒక్క పూటలో మారిపోతున్న మొఖాలు – జగన్ vs నిమ్మగడ్డ లో గంటకొక ట్విస్ట్

Nimmagadda Ramesh Kumar's question will trouble YS Jagan  

ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారం పూటకో ట్విస్ట్ తిరుగుతుంది. క్షణ క్షణానికి ఈ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే సీఎం జగన్ నిమ్మగడ్డ పై చేయి సాధించినట్టే , రాష్ట్రంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోసం నిమ్మగడ్డ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ను హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పు ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ ను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

The election affair turned out to be between ys jagan and Nimmagadda 

వ్యాక్సినేషన్‌ కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ను ఇచ్చింది. ఎందుకంటే మరో రెండు నెలల్లో నిమ్మగడ్డ పదవీ సమయం ముగియబోతుంది. తర్వాతే ఎన్నికలు జరుగుతాయన్న ఆనందం వైసీపీ నేతల్లో ఉంది. అందుకే అంతా ఈ తీర్పుపై ఆనందంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఉంది. ఈ తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.

అందుకే నిమ్మగడ్డ ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు దాఖలు చేసుకున్నారు. హైకోర్టు దాన్ని కూడా విచారణకు స్వీకరించింది. దీనిపై ఇవాళ.. హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం తీర్పు ఇచ్చింది సింగిల్ జడ్జి కాబట్టి అనూహ్యంగా జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరి ఈ రోజు ఏ బెంచ్ ముందుకు వెళ్తుందో, అందులో ఎవరు ఉంటారో, తీర్పు ఎలా వస్తుందో చెప్పలేం. ఎందుకంటే చాలా మంది హైకోర్టు న్యాయ మూర్తులు చంద్రబాబు ఆడించినట్టే ఆడుతున్నారని వైసీపీ నేతలే చాలాసార్లు ఆరోపణలు చెప్తుంటారు. చూడాలి మరి ఈసారి హైకోర్టు ఎవరికీ అనుకూలంగా తీర్పు ఇస్తుందో