ఏపీ ప్రభుత్వానికి షాక్ … స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

court ordered to submit a report considering it as act of contempt

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండగా కరోనా కారణంగా అప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై నిమ్మగడ్డ , ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అంశంపై ఎస్ ‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన హైకోర్టు..ఎస్ ఈ సీ కి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎస్‌ ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల బృందం ఎస్‌ ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీనిపై 29న తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.