YS Jagan: జగన్ క్వాష్ పిటిషన్ విచారణ జులై 1వ తేదీకి వాయిదా

YS Jagan quash petition: పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన నన్ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇతర నిందితులు కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడంతో అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని చెబుతూ జులై 1వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అప్పటివరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశింశారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకుజగన్ వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డులో జగన్ కాన్వాయ్ లోని కారు చక్రాల కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కారులో ఉన్న జగన్ తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిలను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.

మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. తాజాగా ఈ కారును రణాకా శాఖ అధికారులు తనిఖీ చేశారు. కారు కండీషన్, ఫిట్నెస్ ఎలా ఉందని చెక్ చేశారు అధికారులు.