ఏపీ, తెలంగాణ కలిసే అవకాశం ఉందా.. సజ్జల మాటల వెనుక మర్మం ఏంటో?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోకుండా ఉండి ఉంటే ఏపీ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండేవి కావు. అయితే ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఎంతగానో కష్టపడుతున్నా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. వైసీపీ రాష్ట్ర విభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిందని సజ్జల అన్నారు. ఏపీ, తెలంగాణ కలిసి ఉండటం కోసం వైసీపీ ఎన్నో పోరాటాలు చేసిందని ఆయన కామెంట్లు చేశారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశామని సజ్జల వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలని మేము కోరుకుంటున్నామని ఆయన కామెంట్లు చేశారు. సుప్రీం కోర్టు ఏపీ, తెలంగాణలను కలపాలని ఆదేశిస్తే ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఫస్ట్ పార్టీ వైసీపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. సజ్జల చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

అయితే వైసీపీ కొత్తగా విభజన గురించి కామెంట్లు చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సజ్జల ఈ విధంగా చేసిన కామెంట్ల వల్ల విభజన గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. జగన్ కూడా రాబోయే రోజుల్లో ఇదే విధంగా కామెంట్లు చేస్తారేమో చూడాల్సి ఉంది. అయితే సజ్జల కామెంట్లను తెలంగాణ నేతలు మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

విభజన గురించి చర్చ ప్రారంభమైతే మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొన్న సమస్యలను ప్రజలు మరిచిపోయే ఛాన్స్ ఉంది. సజ్జల కామెంట్ల వెనుక ప్రణాళిక ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.