ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విచ్చలవిడి ఏకగ్రీవాల పై ఎలక్షన్ కమిషన్ కూడా ఏమి చేయలేక పోవటంతో టీడీపీ హైకోర్టుని ఆశ్రయించింది. ముఖ్యంగా పుంగనూరు, మాచర్లలో జరిగిన ఏకగ్రీవాల పై హైకోర్టుకు వెళ్ళగా, ఈ రోజు హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఏకగ్రీవాలతో పాటుగా, నామినేషన్ లు తిరస్కరించిన చోట తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ వచ్చిన ఫిర్యాదులు అన్నీ పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబందులు ఎలా ఉన్నాయో, వాటి ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి కోరింది.
పుంగనూరు, మాచర్లలో విచ్చలవిడిగా ఎగ్రీవాలు అయ్యాయి. మాచర్లలో 77కి 76 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే పుంగనూరులో రెండు పంచాయతీలు తప్ప, మిగతావి అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఉండే సదుం మండలంలో, ఏకంగా అన్ని పంచాయతీలు, అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ రకంగా ఏకాగ్రీవాలు అవ్వటం పై, టీడీపీ సీరియస్ అయ్యింది. అన్ని విషయాల పై ఇప్పటికి అనేక ఫిర్యాదులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చేసినా, ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని, అందుకే కోర్టుకు వెళ్లి, తమ హక్కులు సాధించుకుంటాం అని కోర్టులో కేసు వేసారు. జరుగుతున్న పరిణామాల పై వర్ల రామయ్య స్పందించారు…”ఎన్నికలవిధుల్లో ఉన్న అధికారులంతా, వైసీపీకాని వారి నామినేషన్లను ఇష్టానుసారం తిరస్కరిస్తున్నారు. అధికారపార్టీ నేతలమెప్పుకోసం , వారికళ్లల్లో వెలుగులుచూడటంకోసం అధికా రులు వ్యవహరిస్తున్నారు.
అధికారులు, ప్రభుత్వం ఇష్టమొచ్చిన ట్టు చేస్తే టీడీపీ ఊరుకోదు. ఎక్కడైతే అధికారులు అకారణంగా, తప్పుడువిధానాల్లో అభ్యర్థులను, వారిపత్రాలను తిరస్కరించారో అవన్నీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని కేసులను హైకోర్టులోవేశాము. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులెవరినీ వదిలేదు లేదు. అవసరమైతే వారివ్యక్తిగత హోదాలపై కూడా కేసులు వేస్తాము. రిటైరైనా కూడా వారిని వదలకుండా, వారుచేసినతప్పులకు శిక్షపడేలా చేస్తాము. అధికారులు ఎవరైనా సరే, ఆత్మపరిశీలనచేసుకోరా.. వారు తమ ఆత్మలకుసమాధానం చెప్పుకోరా? అవేమీ ఆలోచించకుండా ప్రమోషన్లకోసం, ఇతరత్రా ప్రయోజనాలకోసం అధికారపార్టీకి ఊడిగం చేస్తారా? విశాఖపట్నంలో, చిత్తూరులో, మాచర్లలో అంత అడ్డగోలుతనంగా ఎలా వ్యవహరిస్తా రు? జరుగుతున్న వాటిపై డైరెక్టర్ జనరల్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.