ఆంధ్రప్రదేశ్ :ఏపీ పంచాయతీ ఎన్నికల విచారణను నవంబర్ 2కి వాయిదా వేసిన హైకోర్టు

ap higcourt hearing on panchayathi elections

అమరావతి : పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది.. అదే మాటను ఏపీ ఎన్నికల కమిషనర్ చెప్పాలని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు ఎన్నికల సంఘం తరపున ఎవరూ హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసింది.. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రస్తావించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించింది.. తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.

ap higcourt hearing on panchayathi elections
AP Highcourt-Amaravathi

మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.. కానీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎస్‌ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. నిమ్మగడ్డ తొలగింపు ఎన్నో మలుపులు తిరిగింది. మళ్లీ ఇప్పుడు హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరిగింది. హైకోర్టు నోటీసులుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.